ఫ్రాన్స్‌లో విజృంభిస్తున్న కరోనా.. టెన్షన్..టెన్షన్..
- November 23, 2021
కరోనా పేరు చెప్పగానే యావత్తు ప్రపంచం ఉలిక్కిపడుతోంది. కరోనా మహమ్మరి సృష్టించిన అల్లకల్లోలం అంతాఇంతా కాదు.. కరోనా ధాటికి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఎన్నో దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. 2020 సంవత్సరాన్ని కరోనా కాలంగా గుర్తుండిపోయే విధంగా చేసింది. కరోనా వైరస్ ఫస్ట్, సెకండ్, థార్డ్ వేవ్ అంటూ దశల వారీగా తన ప్రతాపాన్ని చూపుడుతోంది. ఎన్నో దేశాలు కరోనా వైరస్‌పై పరీక్షలు చేసిన టీకాలను కొనుగొన్నారు.
ఆయా దేశ ప్రభుత్వాలు వారి దేశ ప్రజలకు టీకాలు పంపిణి చేస్తూ కరోనా నుంచి కోలుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరోసారి ఫ్రాన్స్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే 70 శాతం ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి చేసినా.. ఇలా కరోనా విజృంభించడంతో ఫ్రాన్స్‌లో టెన్షన్ మొదలైంది. తాజాగా ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టెక్స్‌కు కరోనా సోకింది. ఆయన 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటూ ఆఫీసు పనిచేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఫ్రాన్స్ ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!