మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ తో అక్షయ్ కుమార్ రొమాన్స్..నెటిజన్ల కామెంట్లు మీరే చూడండి..
- November 23, 2021
తనకన్న తక్కువ వయసున్న హీరోయిన్‌తో రొమాన్స్ ఏంటని ప్రశ్నిస్త్నున‍్నారు. అక్కీ నటించిన 'సూర్యవంశీ' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ జోష్‌తో అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'పృథ్వీరాజ్' టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ చౌహన్ జీవితం, ఆయన పరాక్రమం ఆధారంగా తెరకెక‍్కించారు. కత్తి యుద్ధాలు, నినాదాలు, పోరటాలతో పాటు 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ అందులో కనిపించారు. అంతా బానే ఉంది. కానీ ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు మానుషి ప్రియురాలిగా నటించనుంది. ఇదే ఇప్పుడు వివాదస్పదమవుతోంది. దీనికి కారణం అక్కీ, మానుషి మధ్య వయసు తేడా. దీన్ని'ఇదేందయ్యా ఇది' అంటూ ట్రోలింగ్ తో షేక్ చేస్తున్నారు నెటిజన్స్. అంటూ ట్రోలింగ్‌తో షేక్ చేస్తున్నారు నెటిజన్స్.
'అక్కీకి 54, మానిషికి 24.. ఇదా మీ బాలీవుడ్ లవ్ స్టోరీ' అంటూ ఓ యూజర్ స్పందిచగా, '54 ఏళ్ల అక్షయ్ కుమార్, 24 ఏళ్ల మానుషితో రొమాన్స్ చేస్తున్నాడు. గుర‍్తుంచుకోండి, మనం కొంచెం జాగ్రత్తగా హీరోలను ఎంచుకోవాలి' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇంకొకరు 'వాట్ ద హెల్ మ్యాన్, ఇది కొంచైమైనా భావ్యంగా ఉందా' అని రాసుకొచ్చాడు. ఇలా రకరకాలుగా అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్ వయసు తేడాపై ట్రోలింగ్‌కి దిగారు. ఇది కాక అక్కీ అప్‌కమింగ్ మూవీ ఆత్రంగిలో కూడా తన కన్న 28 సంవత్సరాలు చిన్నదైన సారా అలీ ఖాన్‌తో నటించనున్నారు.
అయితే సినీ ఇండస్ట్రీలో ఇదేం కొత్త విషయం కాదు. ఇంతకుముందు ఎంతోమంది కథనాయకులు తమకంటే చాలా ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్స్‌తో యాక్ట్ చేశారు. భారత్ చిత్రంలోని 'స్లో మోషన్' సాంగ్‌లో 29 ఏళ్ల దిశా పటానీతో 55 సంవత‍్సరాల సల్మాన్ ఖాన్ రొమాన్స్ చేశాడు. అలాగే 'దేదే ప్యార్ దే'లో అజయ్ దేవగన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఆ మాటకొస్తే సౌత్ ఇండియాలో కూడా ఇలా ఏజ్ తక్కువ ఉన్న హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసిన హీరోలు ఉన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్