శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టివేత...
- November 23, 2021
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీ, బంగారం తరలిస్తూ ముగ్గురు మహిళలు పట్టుబడ్డారు.మరో కేసులో ఓ ప్రయాణికుడు 9 ఐఫోన్లు తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి బంగారం, విదేశీ కరెన్సీ పట్టుబడింది. బంగారం, విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తూ పలువురు అధికారులకు చిక్కుతున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. యూఏఈ, యుఎస్ కరెన్సీని తరలిస్తున్న ఇద్దరు మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 11.49 లక్షల విలువైన యూఏఈ కరెన్సీ, యుఎస్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మరో మహిళ దగ్గర రూ. 17.69 లక్షలు విలువ చేసే బంగారం బిస్కెట్లను ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరో 9 ఐఫోన్లు స్వాధీనం..
మరో కేసులో ఐఫోన్లు అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం షార్జా నుంచి జీ9-458 విమానంలో వచ్చిన ప్రయాణికుడు 9 ఐఫోన్ 13 ప్రో స్మార్ట్ ఫోన్‌లను అక్రమంగా తరలిస్తున్నాడని అధికారులు తెలిపారు. వీటి విలువ రూ. 8.37 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..