మహిళలకు భారీగా పెరిగిన ప్రసూతి సెలవులు
- November 23, 2021అబుధాబి: 1980 నాటి కార్మిక చట్టానికి తాజాగా సవరణలు చేసిన యూఏఈ పలు కీలక మార్పులు చేస్తోంది.ఇప్పటికే పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలోని కార్మికులకు సంబంధించి సెలవులు, పని వేళల విషయంలో పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.తాజాగా ప్రైవేట్ సెక్టార్లో పని చేస్తున్న మహిళలకు సంబంధించి ప్రసూతి సెలవులను పెంచుతూ అబుధాబి రూలర్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్ కొత్తగా ఫెడరల్ డిక్రీ లా నం.33 ఫర్ 2021ను జారీ చేశారు. దీని ప్రకారం ప్రైవేట్ సెక్టార్లోని మహిళలకు 60 రోజుల పాటు చెల్లింపులతో కూడిన ప్రసూతి సెలవులు ఉంటాయి. వీటిలో 45 రోజులు ఫుల్ పే, 15 రోజులు 50శాతం జీతం వస్తుంది.
ఇక ఈ 60 రోజులు ముగిసిన తర్వాత మహిళలు మరో 45 రోజుల పాటు సెలవులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. వీటికి మాత్రం ఎలాంటి చెల్లింపులు ఉండవు.పుట్టిన బిడ్డకు ఆరోగ్యం బాగాలేకపోయి,బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి హెల్త్ ఇష్యూలు ఉన్న ఈ 45 రోజులు లీవ్ తీసుకోవచ్చు.అయితే, పని చేస్తున్న యాజమాన్యానికి అనారోగ్యానికి సంబంధించి మెడికల్ హెల్త్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి.అలాగే పుట్టిన బిడ్డకు వైకల్యం లేదా ఎదైనా వ్యాధి ఉన్న తల్లి మరో 30 రోజులు సెలవు తీసుకోవచ్చు.అంతేగాక వాటిని మరో నెల రోజులకు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు.కొత్తగా జారీ చేసిన ఈ ఆదేశాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి రానున్నాయి.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం