మహిళలకు భారీగా పెరిగిన ప్రసూతి సెలవులు

- November 23, 2021 , by Maagulf
మహిళలకు భారీగా పెరిగిన ప్రసూతి సెలవులు

అబుధాబి: 1980 నాటి కార్మిక చట్టానికి తాజాగా సవరణలు చేసిన యూఏఈ పలు కీలక మార్పులు చేస్తోంది.ఇప్పటికే పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలోని కార్మికులకు సంబంధించి సెలవులు, పని వేళల విషయంలో పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.తాజాగా ప్రైవేట్ సెక్టార్‌లో పని చేస్తున్న మహిళలకు సంబంధించి ప్రసూతి సెలవులను పెంచుతూ అబుధాబి రూలర్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్ కొత్తగా ఫెడరల్ డిక్రీ లా నం.33 ఫర్ 2021ను జారీ చేశారు. దీని ప్రకారం ప్రైవేట్ సెక్టార్‌లోని మహిళలకు 60 రోజుల పాటు చెల్లింపులతో కూడిన ప్రసూతి సెలవులు ఉంటాయి. వీటిలో 45 రోజులు ఫుల్ పే, 15 రోజులు 50శాతం జీతం వస్తుంది. 

ఇక ఈ 60 రోజులు ముగిసిన తర్వాత మహిళలు మరో 45 రోజుల పాటు సెలవులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. వీటికి మాత్రం ఎలాంటి చెల్లింపులు ఉండవు.పుట్టిన బిడ్డకు ఆరోగ్యం బాగాలేకపోయి,బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి హెల్త్ ఇష్యూలు ఉన్న ఈ 45 రోజులు లీవ్ తీసుకోవచ్చు.అయితే, పని చేస్తున్న యాజమాన్యానికి అనారోగ్యానికి సంబంధించి మెడికల్ హెల్త్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి.అలాగే పుట్టిన బిడ్డకు వైకల్యం లేదా ఎదైనా వ్యాధి ఉన్న తల్లి మరో 30 రోజులు సెలవు తీసుకోవచ్చు.అంతేగాక వాటిని మరో నెల రోజులకు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు.కొత్తగా జారీ చేసిన ఈ ఆదేశాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి రానున్నాయి.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com