కోవాగ్జిన్ తీసుకొని తిరిగి కువైట్ కు రాలేకపోతున్న ఇండియన్స్ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్

- November 24, 2021 , by Maagulf
కోవాగ్జిన్ తీసుకొని తిరిగి కువైట్ కు రాలేకపోతున్న ఇండియన్స్ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్

కువైట్:కువైట్ రావాలనుకుంటున్న ఇండియన్స్ కోసం భారత ఎంబసీ కొత్తగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ స్టార్ట్ చేసింది. కువైట్ కు రావాల్సి వారు కచ్చితంగా కువైట్ అనుమతించిన వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది. ఐతే కరోనా పీక్ లో ఉన్న టైమ్ లో కువైట్ లో ఉన్న చాలా మంది ఇండియన్స్ తిరిగి భారత్ కు వెళ్లిపోయారు. వారిలో కొంతమంది కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా కోవాగ్జిన్ తీసుకున్నారు. ఐతే కువైట్ కోవాగ్జిన్ టీకా ను అనుమతించలేదు. దీంతో మళ్లీ  కువైట్ కు రావాలనుకుంటున్న ఇండియన్స్ కు ఇబ్బందిగా మారింది. ఈ విషయం భారత ఎంబసీ దృష్టికి వెళ్లటంతో సమస్య ను తీర్చటం పై భారత ఎంబసీ ఫోకస్ చేసింది. ఎవరైతే కోవాగ్జిన్ తీసుకున్నారో వారికోసం కొత్తగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ ను స్టార్ట్ చేసింది.  ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇన్ఫర్మేషన్ ను భారత ఎంబసీ తెలియజేస్తుంది. కువైట్ అధికారులతో ఈ సమస్య పై ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు కూడా మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని భారత ఎంబసీ అధికారులు కోరారు. ఆన్ లైన్ లో  http://forms.gle/ce3b9ETGJAeTJZku9   ఈ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com