‘బార్డర్ ఎంట్రీ’ కొత్త ప్రోటోకాల్ అమల్లోకి
- November 24, 2021
యూఏఈ: UAE పొరుగు దేశాల సిటిజన్స్, సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తూ... పదే పదే దేశంలోకి వచ్చిపోయే వారి కోసం బార్డర్ ఎంట్రీ ప్రోటోకాల్ ని యూఏఈ అథారిటీ అప్డేడ్ చేసింది. కొత్త నిబంధనలు నవంబర్ 23 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం.. GCC పౌరులందరూ ఆమోదించబడిన వ్యాక్సిన్లు, బూస్టర్ పూర్తి మోతాదులను తీసుకోవాలి. టీకాలు పొందిన విదేశీయులు సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి 14 రోజుల ముందు నాటి PCR టెస్ట్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాలి. ఎవరైనా వరుసగా ఆరు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు యూఏఈలో ఉన్నట్లయితే, వారు వచ్చిన ఆరవ రోజున కూడా PCR పరీక్ష చేయించుకోవాలి. ఇక టీకాలు వేయని వారి విషయానికొస్తే.. వారు వచ్చే తేదీకి 72 గంటల కంటే ముందుగా చేయించుకున్న నెగిటివ్ PCR పరీక్ష రిపోర్టును సమర్పించాలి. నాలుగు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు UAEలో ఉండేవారు తప్పనిసరిగా వచ్చిన నాల్గవ రోజున, ఎనిమిదవ రోజున PCR పరీక్షను చేయించుకోవాలి. అటు టీకాలు వేసిన, టీకాలు వేయని విద్యా సిబ్బందికి, విద్యార్థులు, విద్యా సంస్థల నుండి వారిని పికప్ చేసే విద్యార్థుల తల్లిదండ్రులకు PCR పరీక్ష ఫలితాల చెల్లుబాటు గడువును 14 రోజులకు పొడిగించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







