డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న అధికారులు...88 మంది అరెస్ట్

- November 25, 2021 , by Maagulf
డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న అధికారులు...88 మంది అరెస్ట్

రియాద్:దేశంలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన వారి కుట్రను సౌదీ అధికారులు అడ్డుకున్నారు. హషీష్, యాంఫెటమైన్ వంటి నిషేధిత డ్రగ్ టాబ్లెట్స్ ను భారీగా స్వాధీనం చేసుకున్నారు. తీర ప్రాంతం బార్డర్ నుంచి డ్రగ్స్ ను దేశంలోకి చాలా రోజులుగా వ్యాపారులు స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతో నార్కోటిక్, ట్రాఫికింగ్ సెక్యూరిటీ అధికారులు అక్రమ రవాణా పై ఫోకస్ చేశారు. ఇటీవల కాలంలో పలు స్మగ్లింగ్ ప్రయత్నాలను విఫలం చేశారు. తాజాగా పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ కు జరుగుతున్న ప్రయత్నంపై పక్కా సమాచారం ఉండటంతో నిఘా వేసి ఈ కుట్ర ను విఫలం చేశారు. స్మగ్లర్ల నుంచి 894 కిలోల హషీష్, 7, 98,860 యాంఫెటమైన్ టాబ్లెట్లు, 57,165 కిలోల ఖాట్‌ స్వాధీనం చేసుకున్నట్లు బోర్డర్ గార్డ్స్  లెఫ్టినెంట్ కల్నల్ మిస్ఫెర్ అల్-ఖురైనీ తెలిపారు. వీటి విలువ బహిరంగా మార్కెట్లో కోట్లలో ఉంటుందన్నారు.

88 మంది అరెస్ట్...

అటు స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న 88 మందిని అరెస్ట్ చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో అరెస్ట్ లు జరగటం ఇటీవల కాలంలో ఇదే మొదటి సారి. అరెస్టైన వారిలో 39 మంది సౌదీ వాసులే. ఇక మరో 49 మంది బార్డర్ సెక్యూరిటీ ను ఉల్లంఘించారని వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా విదేశీయులే. ఒమన్ కు చెందిన వారు 24 మంది కాగా, ఇథియోపియన్లు 21 మంది,  ఈజిప్ట్,  జోర్డాన్, సూడాన్, శ్రీలంకకు చెందిన ఒక్కొక్క పౌరుడు ఉన్నారు. వీరిపై లీగల్ ప్రొసెస్ కంప్లీట్ చేశారు. జైలుకు తరలించారు. 

--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com