ఈ ఏడాది చివరికల్లా..అంతర్జాతీయ విమాన సర్వీసులు!
- November 25, 2021
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రావొచ్చని విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ వెల్లడించారు.కోవిడ్ మహమ్మారి కారణంగా గత ఏడాది ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.ఈ క్రమంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను భారత్ కు తరలించేందుకు,అత్యవసర సరుకుల రవాణా కోసం ప్రభుత్వం కొన్ని విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అయితే కేసులు తగ్గుముఖం పట్టడం,వ్యాక్సిన్ కార్యక్రమం సజావుగా సాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







