శివశంకర్ మాస్టర్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన సోనూసూద్..!
- November 25, 2021ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే.. కరోనాతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు చెపుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి ఖర్చులు బాగా పెరిగిపోయాయని సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నటుడు సోనూసూద్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.శివశంకర్ కుటుంబసభ్యులతో సోనూసూద్ మాట్లాడారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించాడు సోనూసూద్. కాగా శివశంకర్ మాస్టర్ తెలుగుతో పాటుగా తమిళ్ లో కూడా సినిమాలు చేశారు.నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. కేవలం డాన్స్ మాస్టర్ కాకుండా దాదాపుగా ఓ ముప్పై చిత్రాలలో ఆయన నటించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు