త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు...చెన్నై విమానాశ్రయం మూసివేత‌

- November 25, 2021 , by Maagulf
త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు...చెన్నై విమానాశ్రయం మూసివేత‌

చెన్నై: త‌మిళ‌నాడులో మ‌ళ్లీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింది.  అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో తమిళ‌నాడు,రాయ‌సీమ‌లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన‌ట్టుగానే తూత్తుకుడి జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.దీంతో ఆ జిల్లా వ్యాప్తంగా రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.ఇక చెన్నైన‌గ‌రంలో ఈ ఉద‌యం నుంచి ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురుస్తున్న‌ది.  

ఇప్ప‌టి వ‌ర‌కు 200 మీ.మీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది.భారీ వ‌ర్షం కార‌ణంగా చెన్నై విమానాశ్రయంలో విమానాల రాక‌పోక‌లు బంద్ అయ్యాయి.ప‌లు విమానాల‌ను దారి మ‌ళ్లించారు.ర‌న్‌వేపైకి భారీగా వ‌ర‌ద‌నీరు చేర‌డంతో అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.మ‌రో మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించ‌డంతో ముందు అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com