15 డిసెంబర్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభం
- November 26, 2021
న్యూ ఢిల్లీ: కరోనావైరస్ నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి నిలిచిపోయిన షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని శుక్రవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.కేంద్రహోంశాఖ,ఆరోగ్యశాఖ,విదేశాంగశాఖతో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.కాగా,గత వారం పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా..అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి సాధారణ స్థితికి(కోవిడ్ పూర్వ స్థితికి) తీసుకొచ్చే ప్రక్రియపై కేంద్రప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
ఇక,28 దేశాలతో కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ బప్పందంలో భాగంగా కొన్ని నిర్దేశించిన దేశాలకు మాత్రమే ప్రస్తుతం భారత్ నుంచి పరిమిత సంఖ్యలో ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.మరోవైపు,కోవిడ్ కారణంగా గతేడాది మార్చి నుంచి ఆంక్షలను ఎదుర్కొన్న దేశీయ విమాన సేవలు..గత నెల నుంచి పూర్తిస్థాయిలో అనుమతించబడిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







