ఒమిక్రాన్ ఎఫెక్ట్.. కార్మికులకు బూస్టర్ డోసులపై అవగాహన కార్యక్రమాలు
- November 29, 2021
బహ్రెయిన్: ప్రపంచవ్యాప్తంగా COVID-19 కొత్త వేరియంట్ (ఒమిక్రాన్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బహ్రెయిన్ లేబర్ డిపార్ట్మెంట్, సోషల్ డేవలప్మెంట్ మినిస్ట్రీ అలెర్ట్ అయ్యాయి. లేబర్ క్యాంపుల వద్ద కరోనావైరస్ నివారణ ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కార్యక్రమాలను వేగవంతం చేశాయి. దీంతో పాటు వివిధ వైరస్ వేరియంట్ల నుంచి రక్షణకు కార్మికులు వ్యాక్సిన్ బూస్టర్ డోసులను తీసుకునేలా వారికి అవగాహన కల్పిస్తున్నాయి. మొదటి దశ ప్రచారంలో భాగంగా 27,340 ట్రేడింగ్ అవుట్‌లెట్‌లు, 8,277 పారిశ్రామిక సంస్థలు, 6,695 నిర్మాణ సంస్థలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యజమానులు అప్రమత్తంగా ఉండాలని, వర్క్‌సైట్‌లు, లేబర్ క్యాంపుల వద్ద అన్ని ముందస్తు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని లేబర్ మినిస్ట్రీ కోరింది. ఈ మేరకు ఇన్‌స్పెక్షన్ అండ్ ప్రొఫెషనల్ సేఫ్టీ డైరెక్టరేట్ వర్క్‌సైట్‌లు, లేబర్ క్యాంపుల వద్ద పాటించాల్సిన సేఫ్టీ గైడ్ లైన్స్ తెలిపే వివిధ భాషల్లోముద్రించిన ప్రచార పోస్టర్లను పంపిణీ చేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







