బుర్జ్ ఖలీఫా మీద ఆర్జీవీ ట్రైలర్
- November 28, 2021
దుబాయ్:ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లడ్కీ- ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే సినిమా ట్రైలర్ నేడు బుర్జ్ ఖలీఫా మీద ప్రదర్శింపబడింది.ఈ ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధ కట్టడం మీద ప్రదర్శింపబడిన తొలి హిందీ చిత్రం ట్రైలర్ ఇదే కావడం గమనార్హం.
దర్శకుడు రాం గోపాల్ వర్మ,చిత్ర కథానాయిక పూజా నేడు ఈ కార్యక్రమానికి విచ్చేసారు.
"ఇంత గొప్ప మానవ నిర్మితమైన బుర్జ్ ఖలీఫా మీద నా చిత్రం ట్రైలర్ ప్రదర్శింపబడడం గర్వంగా ఉంది.ఇది బ్రూసిలీకి దక్కిన సరైన గౌరవం అని నేను అనుకుంటున్నాను" అని రాం గోపాల్ వర్మ అన్నారు.
బ్రూస్లీ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే విశేషమైన ప్రచారం జరుపుకుంది.చైనీస్ ఉపశీర్షికలతో (సబ్టైటిల్స్) ఈ చిత్రం చైనాలో ఏకంగా 30,000 థియేటర్ల లో విడుదలవుతోంది. చైనాలో అత్యధిక సినిమా హాల్స్ లో విడుదలవుతున్న తొలి భారతీయ
చిత్రంగా అరుదైన గౌరవాన్ని కూడా ఈ చిత్రం పొందుతోంది.
తాజా వార్తలు
- మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ
- BAPS హిందూ మందిర్ రక్షా బంధన్ ఉత్సవాలు..10 వేల రాఖీలు అందజేత
- ఖతార్ లో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి
- మహిళ పోలీసుపై దాడి చేసిన మహిళకు జైలు శిక్ష
- TSRTC బంపరాఫర్: 12 ఏళ్ల వరకు ఆ చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణం
- ఎయిర్ ఇండియా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్.. Dh330కే వన్-వే టిక్కెట్లు
- వెదర్ రిపోర్టును తప్పుగా పబ్లిస్ చేస్తే.. OMR50,000 జరిమానా: ఒమన్
- ఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశం
- గృహ కార్మికుల పరీక్షలు ప్రైవేటీకరణ
- ప్రజల కోసం సలాలా గ్రాండ్ మాల్ తెరవబడింది