యూఏఈ లో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం కంప్లీట్

- November 29, 2021 , by Maagulf
యూఏఈ లో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం కంప్లీట్

యూఏఈ : కరోనా వ్యాక్సినేషన్ లో యూఏఈ సూపర్ సక్సెస్ ను సాధించింది. దేశంలో దాదాపుగా 100 శాతం వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పూర్తి చేసింది. దీని అర్థం అందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైనట్లు కాదని యూఏఈ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికార ప్రతినిధి డాక్టర్ ఫరీదా అల్ హోసని తెలిపారు. రెండో డోసు పూర్తైతేనే వ్యాక్సినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయినట్లు చెప్పారు. ఐతే ఒక్క డోస్ మాత్రం 100 శాతం ప్రజలకు ఇవ్వగలిగామని అన్నారు. దీంతో కరోనా రిస్క్ ను చాలా వరకు తగ్గించినట్లైందన్నారు. అటు వర్క్ వీసా మీద దేశానికి వచ్చే ప్రవాసులకు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైతేనే అనుతించాలని విదేశీ మంత్రిత్వశాఖ అధికారులను డాక్టర్ అల్ హోసని కోరారు. వీలైనంత త్వరగా  దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పూర్తి చేస్తామన్నారు. మూడేళ్లు అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com