తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై అర్ధరాత్రి నుంచి ఆంక్షలు
- November 30, 2021
హైదరాబాద్: ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన 12 దేశాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై ఈ అర్ధరాత్రి నుంచి ఆంక్షలు విధించనున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.ఇప్పటికే తెలంగాణాలో అన్ని చోట్ల వైద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు.వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కూడా వేగంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు.రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుని వారు వెంటనే వేసుకోవాలని ఆయన వెల్లడించారు.ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణి కుంలందరికి ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామన్నారు. ఒకవేళ వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయితే గచ్చిబౌలి టీమ్స్‌కు తరలించనున్నట్టు తెలిపారు.
ఇప్పటి వరకు దేశంలో,రాష్ట్రంలో ఒమిక్రాన్ ప్రవేశించలేదని అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.ఎయిర్ పోర్టులో కట్టుదిట్టమైన చర్యలు అటు కేంద్ర, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రతిచోట థర్మల్ స్క్రీనింగ్‌లు చేస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవ్వరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







