ఒమిక్రాన్ అల‌ర్ట్‌: అర్థ‌రాత్రి నుంచి కొత్త‌రూల్స్‌...

- November 30, 2021 , by Maagulf
ఒమిక్రాన్ అల‌ర్ట్‌: అర్థ‌రాత్రి నుంచి కొత్త‌రూల్స్‌...

న్యూ ఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న‌ది.ద‌క్షిణాఫ్రికా నుంచి వివిధ దేశాల‌కు వ్యాపించింది.దీంతో యూర‌ప్ దేశాల్లో ఇప్ప‌టికే ఆంక్ష‌లు విధించారు.ఇజ్రాయిల్ దేశం స‌రిహ‌ద్దులు మూసివేసింది.జ‌పాన్‌లో మొద‌టి కేసు న‌మోదు కావ‌డంతో ఆందోళ‌న మొద‌లైంది.కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క‌ల‌క‌లంతో కేంద్రం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది.రిస్క్ ఎక్కువ‌గా ఉన్న దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు త‌ప్ప‌ని స‌రిగా ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు.ఆర్టీపీసీఆర్ రిజ‌ల్ట్ వ‌చ్చేవ‌ర‌కు వారు ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి ఉండాలి.  నెగిటివ్ వ‌స్తే హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి.  

ఏడు రోజుల హోమ్ క్వారంటైన్ త‌రువాత 8వ రోజు మ‌రోసారి క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.అప్పుడు కూడా నెగిటివ్ వ‌స్తే బ‌య‌ట‌కు ఇల్లు విడిచి బ‌య‌ట‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఉంటుంది.ఇక ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్‌గా తేలితే వారిని స‌ప‌రేట్‌గా క్వారంటైన్‌కు త‌ర‌లిస్తారు. వారి శాంపిల్స్‌ను INSACOG ల్యాబ్ కు పంపి జీనోమ్ స్వీక్వెన్సింగ్ చేయిస్తారు.ఒక‌వేళ అక్క‌డ ఒమిక్రాన్ వేరియంట్ కాద‌ని తేలితే వారిని సాధార‌ణ క‌రోనా చికిత్స‌ను అందిస్తారు.అదే ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలితే ప్ర‌త్యేక‌మైన చికిత్సను అందిస్తారు.  యూకేతో పాటు అధిక రిస్క్ ఉన్న 44 దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై అధికారులు దృష్టి సారించారు.కేంద్రం విడుద‌ల చేసిన కొత్త రూల్స్ ఈ అర్ధ‌రాత్రి నుంచి అమ‌లులోకి రాబోతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com