సినీ గేయ రచయిత సిరివెన్నెల ఇకలేరు

- November 30, 2021 , by Maagulf
సినీ గేయ రచయిత సిరివెన్నెల ఇకలేరు

తెలుగు సినీ పరిశ్రమకు మరో షాక్ ఎదురైంది. ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు. అనారోగ్యంతో కాస్సేపటి క్రితం తుది శ్వాస విడిచారు.

టాలీవుడ్‌కు ఊహించని కోలుకోలేని షాక్ తగిలింది. సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయే వార్త ఇది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన...కాస్సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 

తాజాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పాడిన పాట రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాట. ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. 1986లో సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా ఆరంగేట్రం చేసిన ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ సినిమానే ఆయనకు ఇంటిపేరుగా మారింది. అప్పట్నించి సిరివెన్నెలగా స్థిరపడ్డారు. తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న ఘనత ఆయనది. అప్పట్నించి ప్రారంభమైన సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ ప్రస్థానం దిగ్విజయంగా ముందుకు సాగుతూనే ఉంది. కొన్ని సినిమాల్లో నటించారు కూడా. 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. స్వర్ణకమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి అద్భుతమైన సినిమాల్లో పాడిన పాటలకు నంది అవార్డులు సాధించారు. నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్‌లో ఆయన పాడిన పాటలే చివరివి కావడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com