నకిలీ వాహన రిజిస్ట్రేషన్ ముఠా అరెస్ట్..

- November 30, 2021 , by Maagulf
నకిలీ వాహన రిజిస్ట్రేషన్ ముఠా అరెస్ట్..

హైదరాబాద్: నకిలీ వాహన రిజిస్ట్రేన్స్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.ఫేక్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఆర్టిఏకు భారీగా నష్టం కలిగించిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వాహన భీమా పాలసీలు.. రిజిస్ట్రేషన్స్ చేస్తున్న ముఠా నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కార్డ్స్, ప్రింటర్ రబ్బర్ స్టాంపులను పోలీసులు ద్వారా చేసుకున్నట్లు సైబారాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.నకిలీ ధ్రవపత్రాల కేసులో ప్రధాన నిందితుడు కొత్తగూడెంలోని ఆర్టీఏ ఏజెంట్ గా పనిచేస్తున్నాడని.. అలాగే మరో కేసులో తాళం వేసి ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న సయ్యద్ మోసిన్..శంకర్ చౌహన్ అనే ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

నకిలీ రాయుళ్లు పెరిగిపోతున్నారు పసి పిల్లలకు పాలలో కలిపే పొడి నుంచి ప్రతిదీ నకిలీ నే. ఈ నకిలీ తో ప్రజల ప్రాణాలకు ప్రమాదం నుంచి ప్రభుత్వ ఆదాయానికి గండి పడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఇలాగే ఫేక్ వెహికల్ రిజిస్ట్రేషన్ తో ఆర్టీఏ కి భారీగా నష్టం కలిచిన నకిలీ ముఠాను సైబారాబాద్ పోలీసులు పట్టుకున్నారు.వీరి నుంచి సొంతంగా ప్రింట్ చేసిన ఫేక్ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కార్డ్స్, ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్లెయిన్ కార్డ్స్, రబ్బర్ స్టాంపులు , 75 ఫేక్ ఆధార్ కార్డ్, 2 లాప్టాప్స్, కంప్యూటర్స్ ఇతర సామాగ్రిని సీజ్ చేసి ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com