అమెరికాలో యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకలు

- November 30, 2021 , by Maagulf
అమెరికాలో యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకలు

యూఏఈ: డిసెంబర్ 2న 50వ యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల కోసం యూఏఈ ముస్తాబవుతోంది. మరోపక్క, వేలాది కిలోమీటర్ల అవతల, అమెరికాలోని న్యూయార్క్‌లో కూడా యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. యూఏఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్ని నిర్వహించేందుకోసం అత్యద్భుతంగా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు ఈవెంట్లు కూడా నిర్వహిస్తారు. న్యూయార్క్‌లోని యూఏఈ కాన్సులేట్ 5కె రన్ డిసెంబర్ 4న నిర్వహిస్తారు. న్యూయార్క్‌లోని ప్రొఫెట్ మసీదు వద్ద ఈ రన్ జరుగుతుంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎమిరేటీలు ఈ ఈవెంట్లలో పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com