దేశం విడిచి వెళ్లొద్దంటూ పౌరులు,ప్రవాసులకు కువైట్ హెచ్చరిక..!
- December 01, 2021
కువైట్ సిటీ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో దేశ పౌరులు, వలసదారులకు కువైట్ తాజాగా కీలక సూచన చేసింది. ప్రస్తుత పరిస్థితిలో దేశం నుంచి బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది.కొత్త వేరియంట్ శరవేగంగా ప్రబలుతున్నందున ఈ సమయంలో విదేశాలకు వెళ్లడం మంచిది కాదని అంతర్గత, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.కొన్ని రోజుల తర్వాత ఒమైక్రాన్(B.1.1.529)పై ఓ అవగాహన ఏర్పడే అవకాశం ఉందని, అప్పటి వరకు కువైట్ విడిచి బయటకు వెళ్లొద్దని సూచించారు.అలాగే నవంబర్ 27న మంత్రివర్గం తీసుకువచ్చిన ప్రత్యేక కరోనా నిబంధనలను పౌరులు, నివాసుతులు పాటించాలని కోరారు.తప్పని పరిస్థితిలో మాత్రమే ప్రత్యేక అనుమతులు తీసుకుని వెళ్లొచ్చని తెలిపారు.ఇక ఇప్పటికే ఒమైక్రాన్ కట్టడికి కువైట్ చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా తొమ్మిది ఆఫ్రికన్ దేశాలకు కువైత్ విమాన సర్వీసులు నిలిపివేసింది.ఈ మేరకు కువైటీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటన చేసింది.విదేశాల్లో చిక్కుకున్న వారు అవసరమైన సాయం పొందడానికి ఆయా దేశాల్లోని కువైట్ ఎంబసీలతో కమ్యూనికేట్ కావాలని మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ సూచించింది.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









