వీసా రెన్యువల్ ఫ్రీ.17 దేశాల ప్రవాసులకు బెనిఫిట్

- December 01, 2021 , by Maagulf
వీసా రెన్యువల్ ఫ్రీ.17 దేశాల ప్రవాసులకు బెనిఫిట్

సౌదీ: రెసిడెన్సీ పర్మిట్ (ఇఖామా), ఎగ్జిట్, రీఎంట్రీ వీసాలు, విజిట్ వీసాల చెల్లుబాటును ఎటువంటి రఫీ లేకుండా పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో 17 దేశాల ప్రవాసులకు బెనిఫిట్ కానుందని  సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) ప్రకటించింది. జవాజత్ తాజా నిర్ణయంతో ఇండోనేషియా, పాకిస్థాన్, ఇండియా, టర్కీ, లెబనాన్, ఈజిప్ట్, బ్రెజిల్, ఇథియోపియా, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, మొజాంబిక్, బొత్సావానా, లెసోతో , ఎస్వాటిని (స్వాజిలాండ్) దేశాలఎన్నారైలకు ప్రయోజనం కలుగనుంది. వీసా రెన్యువల్ ను జనవరి 31, 2022 వరకు ఎలాంటి ఫీ లేకుండానే చేసుకోవచ్చు. కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు ఈనిర్ణయాన్ని తీసుకున్నట్టు..రీ-ఎంట్రీ వీసాపై విదేశాలకు పోయే ముందు వ్యాక్సిన్ పూర్తి దోసులు తీసుకొన్న వారికి తాజా పొడిగింపు వర్తించదని జవాజత్ వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com