విమానాశ్రయంలోనే 6 గంటలు…
- December 01, 2021
న్యూ ఢిల్లీ: ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ వేరియంట్ కారణంగా చాలా దేశాలు ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి.ఇజ్రాయిల్ ఏకంగా సరిహద్దులను మూసివేసింది.కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి.ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పని సరిగా చేయించుకోవాలి.పరీక్ష చేయించుకోని రిజల్ట్ వచ్చే వరకు విమానాశ్రయంలోనే వేచి ఉండాలని ఆంక్షలు విధించారు.దీంతో విమానాశ్రయంలో సుమారు 8 నుంచి 9 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
చెకింగ్, ఇమిగ్రేషన్ వంటివి పూర్తి కావడానికి సుమారు రెండు గంటలు పడుతుంది. క్యూలైన్లో నిలబడి పరీక్షలు చేయించుకోవడానికి అదనంగా మరో రెండు గంటల సమయం పడుతుంది.శాంపిల్స్ ఇచ్చిన తరువాత రిజల్ట్ రావడానికి మరో నాలుగు గంటల సమయం పడుతుంది.దీంతో రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయంలోనే ఉండి పోవాల్సి వస్తున్నది.అయితే, గంటల తరబడి విమానాశ్రయంలో ఉండటం కూడా ప్రమాదమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా వైరస్ సోకి ఉంటే వారి వలన మిగతా వారికి కూడా సోకే ప్రమాదం ఉండోచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







