వ్యాక్సినేషన్ పూర్తిగా పొందిన ఉమ్రా యాత్రీకులకు క్వారంటైన్ అవసరం లేదు

- December 02, 2021 , by Maagulf
వ్యాక్సినేషన్ పూర్తిగా పొందిన ఉమ్రా యాత్రీకులకు క్వారంటైన్ అవసరం లేదు

సౌదీ: రెండు డోసుల పూర్తి వ్యాక్సిన్ తీసుకున్న విదేశీ ఉమ్రా యాత్రీకులకు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ అవసరం లేదు. అయితే, సౌదీ అరేబియాలో అనుమతించబడిన వ్యాక్సిన్లనే యాత్రీకులు పొంది వుండాలి. విదేశాల నుంచి వచ్చే యాత్రీకులు 30 రోజులపాటు సౌదీలో వుండేందుకు అనుమతించనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన వ్యాక్సిన్లను వేసుకున్నవారికి మాత్రం మూడు రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి. అలాంటివారు తప్పనిసరిగా 48 గంటల తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. నెగెటివ్ రిపోర్ట్ వచ్చినవారికి మాత్రమే ఉమ్రా ప్రార్ధనకు అనుమతిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com