భారత్, బంగ్లాదేశ్ మధ్య బంధం మరింత బలపడింది....

- March 23, 2016 , by Maagulf
భారత్, బంగ్లాదేశ్ మధ్య బంధం మరింత బలపడింది....

 భారత్, బంగ్లాదేశ్ మధ్య బంధం మరింత బలపడింది. రెండు దేశాల మధ్య విద్యుత్తు, ఇంటర్నెట్ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టమైంది. విద్యుత్తు సరఫరా లైన్‌ను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ విద్యుత్తు లైన్ వల్ల త్రిపురా రాష్ట్రం సుమారు 100 మెగావాట్ల విద్యుత్తును బంగ్లాదేశ్‌కు సరఫరా చేయనుంది. మరోవైపు బంగ్లాదేశ ప్రధాని షేక్ హసినా 100జీబీపీఎస్ ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్‌ను ప్రారంభించారు. దీని ద్వారా అగర్తలా రాష్ర్టానికి ఇంటర్నెట్ సౌకర్యం లభించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల ప్రధానులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి మహమూద్ అలీ, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, త్రిపురా సీఎం మానిక్ సర్కార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com