చౌక మద్యం ను ....బ్రాండెడ్ మద్యంగా చెలామణి
- March 23, 2016
తాగి పారేసిన బ్రాండెడ్ సీసాలను పెద్ద మొత్తంలో సేకరించి వాటిలో చౌక మద్యంను నింపి తాజా సరుకు మాదిరిగా బ్రాండ్ల స్టికర్లును అతికించి భారీగా వ్యాపారం చేస్తున్న ఓ ముఠా పోలీసులకు దొరికింది. బహరేన్ లోని అడ్లియ ప్రాంతంలో ముగ్గురు సభ్యులుగల ముఠా వారి ఇంటి నుంచి జోరుగా అమ్మకాలు కొనసాగిస్తూ అక్రమ వాణిజ్యం జరుపుతున్నారు. ఒక ఆధారం ప్రకారం, వారు ఖరీదైన మద్యం బ్రాండ్ల స్టికర్లు సంపాదించి వాటిని మద్యం సీసాలపై అంటించి వాటిని అధిక లాభం కోసం ఘరానాగా విక్రయిస్తున్నారు. డిటి వార్తలకు సమాచార ప్రకారం అడ్లియ ఆధారిత భారత నిర్వాసితులు ద్వారా ముగ్గురు సభ్యులుగల ముఠాకు భారతదేశం నుండి స్టికర్లు అక్రమ రవాణా కాబడుతున్నట్లు వెల్లడించారు. బార్లలో తాగి పారేసిన బ్రాండెడ్ సీసాలను పెద్ద మొత్తంలో సేకరించి వాటిలో చౌక మద్యంను నింపి తాజా సరుకు మాదిరిగా వాటిపై బ్రాండ్ల స్టికర్లును అతికించి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్స్తున్నట్లు అభియోగం వారిపై నమోదైంది . రుచి మరియు మద్యం ప్రభావం కోసం వారు రసాయన పదార్ధాలను కలపడంలో ఈ గ్యాంగ్ బాగా ఆరితేరారు. ఈ చౌక మద్యంను ఖరీదైన మద్యంగా చెలానణి చేయడం...వాటిని ఏ ప్రాంతానికైనా బదిలీ సేవలు అందించడానికి, ఆ ముగ్గురు మూలం అన్నారు. ఆ ముఠాలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు, ఉద్యోగులు తమకు చౌక మద్యం చేసే ముఠా గూర్చి పూర్తి సమాచారం అందించారని తెలిపారు. డిటి వార్తలు బృందం ఒక వినియోగదారుని తీరులో చౌక మద్యం తయారు చేసే ముఠా సంప్రదించగా, వారు మొదట తాము ఏ విధమైన అక్రమ మద్యం అమ్మడం లేదని ఖండించారు, అయితే తరువాత వారు ఏ బ్రాండు మద్యం ఎంత కావాలో అడిగి మరీ తెలుసుకొన్నారు. ఈ సంభాషణ సమయంలో, వారు కావాలంటే ఒక వేశ్య ను సైతం అందించగలమని ఒక ప్రకటన చేసింది. వ్యభిచారి యొక్క సేవలను అవసరం ఉంటే ముఠా చెప్పమని ముగ్గురు ముఠా లో ఒక సభ్యుడు సమీర్ కొంటెగా ప్రశ్నించాడు. అయెతే, ఆ కార్యకలాపాలను వారు నిర్వహిస్తున్నారో లేదో తమకు స్పష్టత లేదని డిటి వార్తలు బృందం తెలిపింది
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







