భారత్, బంగ్లాదేశ్ మధ్య బంధం మరింత బలపడింది....
- March 23, 2016
భారత్, బంగ్లాదేశ్ మధ్య బంధం మరింత బలపడింది. రెండు దేశాల మధ్య విద్యుత్తు, ఇంటర్నెట్ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టమైంది. విద్యుత్తు సరఫరా లైన్‌ను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ విద్యుత్తు లైన్ వల్ల త్రిపురా రాష్ట్రం సుమారు 100 మెగావాట్ల విద్యుత్తును బంగ్లాదేశ్‌కు సరఫరా చేయనుంది. మరోవైపు బంగ్లాదేశ ప్రధాని షేక్ హసినా 100జీబీపీఎస్ ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్‌ను ప్రారంభించారు. దీని ద్వారా అగర్తలా రాష్ర్టానికి ఇంటర్నెట్ సౌకర్యం లభించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల ప్రధానులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి మహమూద్ అలీ, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, త్రిపురా సీఎం మానిక్ సర్కార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







