గన్నవరం విమానాశ్రయం నుంచి త్వరలో విజయవాడ - దుబాయ్ ఎయిర్ ఇండియా విమాన సేవలు
- March 23, 2016
విమనాశ్రాయాల్లో రెండు కేటగిరీలు ఉంటాయి. ఒకటి కస్టమ్స్, మరొకటి అంతర్జాతీయ విమానాశ్రయం. విశాఖపట్నం విమానాశ్రయం కస్టమ్స్ విమానాశ్రయం మాత్రమే. విదేశీ విమానాల రాకపోకల కోసం విజయవాడను తొలుత కస్టమ్స్ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు, ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ కమిషనర్‌తో అధికారులు సంప్రదింపులు జరిపారు.తమ అవసరాలు రెండు నెలల్లో చెబుతామని కస్టమ్స్ అధికారులు చెప్పారు. విజయవాడ-హైదరాబాద్-దుబాయ్ విమానం కోసం ఎయిర్ ఇండియాతో కూడా విమానాశ్రయ అధికారులు సంప్రదింపులు జరిపారు. ఈ ప్రత్యేక విమాన సర్వీసు కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.
70 శాతం పెరిగిన ప్రయాణికుల వృద్ధి : రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడ నగరం నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉండడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి.ఇతర రాష్ట్రాల విమాన సర్వీసులకు కూడా ప్రజల నుంచి ఆదరణ బాగా పెరిగింది. 2014-15 సంవత్సరంలో 2,33,617 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే, 2015-16 సంవత్సరంలో ప్రయాణికుల సంఖ్య 3,96,579కు చేరుకుంది. అంతకుముందు ఏడాది ప్రయాణికుల వృద్ధి 19 శాతం మాత్రమే ఉండగా, గత ఏడాది మాత్రం వృద్ధి రేటు 70 శాతం పెరిగింది. అదే విధంగా 2014-15 సంవత్సరంలో 5,386 విమానాలు రాకపోకలు సాగిస్తే, 2015-16 సంవత్సరానికి 7,596 విమానాల రాకపోకలతో 41 శాతం వృద్ధి జరిగింది.
ఏప్రిల్ నుంచి పెరగనున్న విమాన సర్వీసులు : గన్నవరం విమానాశ్రయానికి ఆదరణ పెరుగుతుండడం, ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో విమానయాన సంస్థలు కొత్త విమాన సర్వీసులను నడిపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రాజధాని అయిన నేపథ్యంలో పెరిగిన డిమాండ్, వేసవి సెలవులు, పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సర్వీసులు పెడుతున్నారు. ఏప్రిల్ నుంచి 12 విమాన సర్వీసులు పెరగుతున్నాయి. వేసవి షెడ్యూల్ ప్రకటించిన విధంగా రోజుకు 34 నుంచి 36 వరకు సర్వీసులు గన్నవరం విమానాశ్రయం నుంచి నడిచే అవకాశం ఉంది. కొత్తగా ట్రూ జెట్ సంస్థ ఏప్రిల్ మొదటి వారం నుంచి తిరుపతి, కడప, హైదరాబాద్‌కు, ఎయిరిండియా సంస్థ ఏప్రిల్ ఒకటి నుంచి సాయంత్రం పూట బెంగుళూరుకు, స్పైస్ జెట్ సంస్థ తిరుపతికి ఒక కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నాయి. పుష్కరాల కోసం అదనపు సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలు వస్తున్న దృష్ట్యా, అన్నీటికి సమంగా స్లాట్స్‌ను కేటాయించేందుకు చర్యలు విమానాశ్రయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 6.45 గంటల నుంచి రాత్రి 9.55 గంటల వరకు, అంటే రోజుకు సుమారు 16 గంటలు పాటు విమానయాన సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. అదనపు సర్వీసులు నడపాలనుకుంటున్న వారికి స్లాట్స్ ప్రకారం సమయం కేటాయించి, అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు సన్నధం అవుతున్నారు.
గన్నవరం విమానాశ్రయంలో రూ.128 కోట్లతో కొత్త ఇంటెరిమ్ టెర్మినల్ భవనం నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఏప్రిల 30 నాటికి కట్టడం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం ఎలక్ట్రికల్, ఏసీ, సీసీటీవీ, సెక్యూరిటీ సిస్టమ్స్ వంటి ఇతర సదుపాయాలు కూడా టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పుష్కరాల సమయానికి సమాయనికల్లా టెర్మినల్‌లను సిద్ధం చేయాలని ప్రణాళికలు చేశారు. పాత టెర్మినల్ ప్రయాణికుల సామర్థ్యం 150 నుంచి 200 మంది మాత్రమే ఉండగా.. కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తే పీక్ టైమ్‌లో 500-600 మంది ప్రయాణికులు ఒకేసారి వచ్చినా సరిపోయే విధంగా నిర్మిస్తున్నారు. విస్తరణలో భాగంగా ఎక్కువ విమానాలను పార్కింగ్ చేసేందుకు వీలుగా, పది పార్కింగ్ ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నారు. వీటిని జూన్ నెలాఖరుకి సిద్ధం చేస్తున్నారు. విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా ఫేస్-1లో రన్‌వే విస్తరణ కూడా చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం రన్‌వే 2,286 మీటర్లు ఉండగా, దాన్ని 3,025 మీటర్లు పొడిగిస్తున్నారు. రన్‌వే విస్తరణ పనులకు రూ.150 కోట్లతో అంచనాలు తయారు చేశారు. స్థల సేకరణ అనంతరం విమానాశ్రయానికి స్థలాన్ని అప్పగిస్తే విస్తరణ పనులను చేపట్టనున్నారు.
వేసవి కోసం కొత్త సేవలు:
గన్నవరం విమానాశ్రయం దాదాపు 34 సేవల వేసవి రద్దీ కారణంగా త్వరలో అందుబాటులోకి రానుంది.
ఏప్రిల్ 1 నుంచి. ప్రతి రోజు ప్రారంభమయ్యేట్రూ జెట్ 9 .25 గంటలప్పుడు హైదరాబాద్ ఒక విమాన ఆపరేట్ విమానయాన సంస్థలు మూడుసార్లు వారంలో కడప, తిరుపతి వరకు విమానాలు పనిచేస్తాయి అవుతుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









