వాలంటరీ సర్వీస్ లో బహ్రెయిన్ రికార్డు

- December 05, 2021 , by Maagulf
వాలంటరీ సర్వీస్ లో బహ్రెయిన్ రికార్డు

బహ్రెయిన్: ఎకనామిక్, సోషల్ డెవలప్ మెంట్ రంగాల్లో అభివృద్ధి కోసం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వాలంటీర్ డేని జరుపుకోనున్నారు. బహ్రెయిన్ లేబర్ అండ్ సోషల్ డెవలప్ మెంట్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వలంటీర్ డే ని ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. స్వచ్ఛంద సేవలో బహ్రెయిన్ గొప్ప రికార్డును కలిగి ఉందని లేబర్ అండ్ సోషల్ డెవలప్ మెంట్ మినిస్టర్ జమీల్ బిన్ మహ్మద్ అలీ హుమైదాన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశం కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి అవసరమైనప్పుడు అధికారిక సంస్థలకు మద్దతు ఇవ్వడానికి బహ్రెయిన్‌లు ఆసక్తికి ఇటీవలి కరోనావైరస్ మహమ్మారి సజీవ రుజువన్నారు. ఈ ఆన్యువల్ ఈవెంట్ స్వచ్ఛంద, సామాజిక, స్వచ్ఛంద సేవా కార్యకర్తలందరికీ నివాళులు అర్పించే అవకాశాన్ని కల్పిస్తుందని హుమైదాన్ అన్నారు. HM ది కింగ్స్ రిఫార్మ్ ప్రాజెక్ట్ ల ఫలితంగా బహ్రెయిన్లో సోషల్ సర్వీస్ ప్రొఫెషనర్ డ్యూటీలో భాగమైందన్నారు. లేబర్ అండ్ సోషల్ డెవలప్ మెంట్ మినిస్ట్రీ పర్యవేక్షణలో 632 NGOలు ఉన్నాయని చెప్పారు. ఇది వలంటీర్ల వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో బహ్రెయిన్ నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్ మెంట్ కోసం ఇంటర్నేషనల్ వాలంటీర్ డే ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ A/RES/40/212 ద్వారా 17 డిసెంబర్ 1985న గుర్తించింది. వలంటీర్ సర్వీస్ ప్రాధాన్యత, సహకారంపై అవగాహన కల్పించడంతోపాటు యూత్ ను ప్రోత్సహించాలని లక్ష్యంగా ఏటా ఇంటర్నేషనల్ వాలంటీర్ డే ని నిర్వహిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com