'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. సినిమా సరికొత్త పోస్టర్ల...

- March 23, 2016 , by Maagulf
'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'.  సినిమా సరికొత్త పోస్టర్ల...

పవన్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, కాజల్‌ జంటగా నటించిన చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ సినిమా సరికొత్త పోస్టర్లను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గత పోస్టర్లలో పోలీసు దుస్తులతో అభిమానులను అలరించిన పవన్‌కల్యాణ్‌... నూతన పోస్టర్లలో క్యాజువల్‌ డ్రెస్‌లో ఉన్నారు. అంతేకాదు పవన్‌తోపాటు కాజల్‌ కూడా సందడి చేసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. ఏప్రిల్‌ 8న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com