ఆర్డర్ ఆఫ్ జాయెద్: డాక్టర్ సుల్తాన్ అల్ కాసిమి సెంటర్‌లో పీస్ ఆఫ్ మంత్

- December 06, 2021 , by Maagulf
ఆర్డర్ ఆఫ్ జాయెద్: డాక్టర్ సుల్తాన్ అల్ కాసిమి సెంటర్‌లో పీస్ ఆఫ్ మంత్

యూఏఈ: ఆర్డర్ ఆఫ్ జాయెద్ ఈసారి 50వ జాతీయ దినోత్సవ వేడుకల సమయంలో ప్రకటితమయ్యింది. షార్జా రూలర్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి (షార్జా రూలర్ మరియు సుప్రీం కౌన్సిల్ మెంబర్)కి ఈ అవార్డు అందించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుంచి అల్ ముష్రిఫ్ అబుదాబీ హాస్పిటాలిటీ ప్యాలెస్‌లో ఈ అవార్డుని అందుకున్నారు. సాంస్కృతికం, కళలు, లిటరేచర్ విభాగాల్లో షార్జా రూలర్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com