శంషాబాద్ విమానాశ్రయంలో కువైట్ వెళ్తున్న 44 మంది మహిళలు అరెస్ట్..
- December 08, 2021
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి నకిలీ వీసాల ముఠా బాగోతం వెలుగుచూసింది. ఏకంగా 44 మంది మహిళలను నకిలీ వీసాలతో కువైట్ పంపేందుకు ఓ ముఠా యత్నించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళా ప్రయాణికులు కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేస్తుండగా వీరిలో కొందరు ఆందోళనతో కనిపించారు. వారి వద్ద ఉన్న పత్రాలు కూడా అనుమానాస్పదంగా ఉండడంతో ఎయిర్‌పోర్టు ఇమిగ్రేషన్ అధికారులు లోతుగా విచారించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. మహిళల వద్ద ఉన్న ఎంప్లాయ్మెంట్ వీసా, విజిట్ వీసాలు నకిలీవని తేలడంతో అధికారులు మహిళలందరినీ విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నకిలీ వీసాల దందాలో హైదరాబాద్, చెన్నైకి చెందిన కొందరు ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!