కువైట్ లో అవినీతి నిర్మూలనకు మరిన్ని చర్యలు...

- December 08, 2021 , by Maagulf
కువైట్ లో అవినీతి నిర్మూలనకు మరిన్ని చర్యలు...

కువైట్: దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా  యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) ను మరింత బలోపేతం చేయనుంది. ఈ మేరకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నజాహా చైర్మన్, అబ్దుల్ అజీజ్ అల్-ఇబ్రహీం తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా UN కన్వెన్షన్, అరబ్ అవినీతి వ్యతిరేక సదస్సులో కువైట్ చేరడంతోనే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. పాలస్తీనా అవినీతి నిరోధక అథారిటీ మూడవ అంతర్జాతీయ సదస్సులో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ రంగంలో జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి చట్టాల రూపకల్పనకు నజాహా కృషి చేసిందన్నారు. ఆడిటింగ్ మోసాలు, పబ్లిక్ టెండర్లలో మోసాలను కనిపెట్టేందుకు సెంట్రల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడంతోపాటు పాలనలో పారదర్శకతకు నజాహా కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థిరమైన అభివృద్ధి 2030 లక్ష్యాలను సాధించే ప్రయత్నాలలో నజాహా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com