ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..
- December 08, 2021
ఎయిర్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల అయింది.సూపర్వైజర్ సెక్యూరిటీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు నేరుగా ఇంటర్వ్యూ (walk in interview) నిర్వహిస్తోంది ఎయిర్ ఇండియా. ఆసక్తి గల అభ్యర్ధులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 40 అర్హత: ఏదైనా యూనివర్శిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడగలగాలి. BCAS Basic AVSEC సర్టిఫికెట్ ఉండాలి. శారీరక ప్రమాణాలు: మహిళలు కనీసం 154.5 సెంటీమీటర్లు, పురుషులు 163 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 2.5 సెంటీమీటర్ల సడలింపు ఉంటుంది. వయస్సు: 2021 డిసెంబర్ 15 నాటికి 45 ఏళ్ల లోపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే తేదీలు: 2021 డిసెంబర్ 15, 16 ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ దరఖాస్తు ఫీజు: రూ.1000 వేతనం: నెలకు రూ.22,371+రూ.2500 అలవెన్స్ జాబ్ లొకేషన్: భువనేశ్వర్, దీమాపూర్, ఇంఫాల్, రాంచీ, చండీగఢ్, లక్నో, డామన్, రాయ్‌పూర్, షిల్లాంగ్ ఇంటర్వ్యూ జరిగే స్థలం: Alliance Air Aviation Limited, Alliance Bhawan, Domestic Terminal 1.I.G.I.Airport, New Delhi110037. అభ్యర్ధులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ https://www.airindia.in/careers.htm నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. టెన్త్, డిగ్రీ, BCAS Basic AVSEC, క్యాస్ట్ సర్టిఫికెట్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేయాలి. Alliance Air Aviation Limited, Payable at New Delhi పేరుతో రూ.1000 డీడీ తీసీ అప్లికేషన్ ఫామ్‌కు జత చేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫారమ్ తీసుకొని 2021 డిసెంబర్ 15,16 తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?