కొత్త కోవిడ్ కిట్...30 నిమిషాల్లోనే రిసల్ట్
- December 08, 2021
పూణే: కరోనా కొత్త వేరియంట్ భయం ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నది.వివిధ దేశాల నుంచి ప్రయాణికులు భారత్‌కు వస్తున్నారు.అయితే, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడానికి, రిపోర్టులు రావడానికి చాలా సమయం పడుతున్నది.దీంతో విమానాశ్రయాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.రద్దీ పెరిగిపోవడంతో విమానాశ్రమాలు కోవిడ్ హాట్స్పాట్లుగా మారే అవకాశం ఉంది.దీంతో రద్దీని తగ్గించేందుకు వేగంగా కరోనా ఫలితాలు వచ్చేందుకు అవసరమైన కిట్ల తయారీపై ఐసీఎంఆర్,నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ దృష్టి సారించింది.
ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఆర్టీ ల్యాంప్ పేరుతో కోవిడ్ కిట్‌ను సిద్దం చేసింది.ఈ కిట్‌తో పరీక్షలు నిర్వహిస్తే అరగంటలోనే ఫలితాలు వస్తాయని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.ఈ ఆర్టీల్యాంప్ కిట్‌తో వందశాతం ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని, పైగా ఖర్చు సైతం 40 శాతం వరకు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.మరో రెండు వారాల్లో కొత్త కిట్లు అందుబాటులోకి వస్తాయని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







