అల్-బహాలో ఈకో టూరిజం క్యాంప్. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్
- December 09, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా మొదటిసారి ఈకో టూరిజం క్యాంపు ఏర్పాటు కానుంది. దీని ఏర్పాటుకు సౌదీ అరేబియా ప్రభుత్వం అనుమతిచ్చింది. సౌదీ అరేబియా దక్షిణ అల్-బహా ప్రాంతంలో ఈ క్యాంపును ఏర్పాటు చేయనున్నారు. కిల్వా గవర్నరేట్‌లోని అల్-హోద్న్ నేషనల్ పార్క్ లో మొత్తం 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈకో క్యాంప్ సందర్శకులను అలరించనుంది. సౌదీ ఎన్విరాన్మెంట్, వాటర్, అగ్రికల్చర్ మినిస్ట్రీ నిర్దేశించిన నిబంధనలు, షరతులకు అనుగుణంగా మూడు నెలల కాలానికి అనుమతి ఇచ్చారు. వన్యప్రాణుల సహజ పరిస్థితులను ప్రభావితం చేయని విధంగా టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. సౌదీలో ప్రముఖ ప్రాంతాల్లో టూరిజాన్ని పెంచేందుకు ఇలాంటి ఈకో టూరిజం క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!