ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు..
- December 10, 2021
అమరావతి: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపధ్యంలో జగన్ సర్కార్ పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర హోంశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను మరోసారి కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించవారికి రూ.100 జరిమానా విధించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాస్కులేని వారిని దుకాణాల్లో, వాణిజ్య ప్రదేశాల్లో, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధించనున్నారు. ఎవరైనా సరే ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థలను 2 రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దుకాణాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో ఉల్లంఘనలు జరిగితే ప్రజలు 8010968295 నెంబరుకు వాట్సప్ ద్వారా తెలియజేయవచ్చునని ప్రభుత్వం సూచించింది. ఇక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







