విదేశాల నుంచి అడ్డదారిలో బంగారం స్మగ్గ్లింగ్...
- December 11, 2021
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో రూ.3.60కోట్ల విలువైన బంగారం పట్టివేత.విదేశాల నుంచి అడ్డదారిలో అక్రమ బంగారం తరలించడానికి స్మగ్లర్లు ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం నలుగురు విదేశీ ప్రయాణికులు మల ద్వారంలో 7.3 కిలోల బరువు గల బంగారాన్ని తీసుకురావడంతో భద్రతాధికారులు అవాక్కయ్యారు.ఇటీవల భారీ స్థాయిలో బంగారం పట్టుబడటం ఇదే తొలిసారి.శంషాబాద్ విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. సూడాన్‌కు చెందిన ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ విమాన సర్వీస్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో 7.3 కిలోల బంగారం బిస్కెట్లతో పాటు కరిగించి ముద్ద చేసిన బంగారాన్ని మలద్వారంలో పెట్టుకొని శంషాబాద్‌కు వచ్చారు. నలుగురు సూడాన్ దేశస్థులపై భద్రతా సిబ్బందికి అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని క్షుణ్నంగా పరిశీలించినా బంగారం దొరకలేదు. వైద్యుల సహాయంతో మల ద్వారం వద్ద పరిశీలించగా బంగారం బయట పడింది. రూ.3.6 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
--ఎం.శ్రీనివాస్(మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







