అమెరికాలో టోర్నడో బీభత్సం...
- December 11, 2021
అమెరికా: అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది.ఈశాన్య రాష్ట్రంలోని కెంటకీలో టోర్నడో విళయానికి సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య అధికమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు.కెంటనీ చరిత్రలో అత్యంత తీవ్రమైనదిగా ఆయన అభివర్ణించారు. శుక్రవారం సంభవించిందిన టోర్నడో బీభత్సానికి అధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించారు. సహాయక చర్యల కోసం సిబ్బంది రంగంలోకి దిగారు. కెంటకీలో సుమారు 180 మంది సహాయక చర్యలను చేపడుతున్నారు.
టోర్నడో వల్ల కూలిపోయిన భవనాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వీరిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 200 మేళ్ల మేర పలు జిల్లాలపై ప్రభావం చూపిందని, ఓ ఫ్యాక్టరీలో పైకప్పు కూలడంతో భారీగా ప్రాణ నష్టం జరిగిందని గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు. స్థానికంగా ఉండే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి తగిన సహాయం అందచేయాల్సిందిగా ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
అమెజాన్ వేర్హౌస్ లో సుమారు వంద మంది కార్మికులు లోపల చిక్కుకున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. వీరిని కాపాడేందుకు శనివారం ఉదయం నుంచి సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ భవనంలో కొద్దిభాగం శిథిలావస్థకు చేరుకుందని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కూలిపోయిన భవనానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇల్లినాయిస్ స్టేట్ పోలీస్,ఇల్లినాయిస్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీలతో అధికారులు సమన్వయం చేసుకుంటూ…సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని, తాను పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.మోనెట్టే మనోర్ నర్సింగ్ హోమ్ ను టోర్నడో చుట్టుముట్టడంతో ఒకరు చనిపోయారని, 20 మంది చిక్కుకపోయినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. ఇందులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీయడం జరిగిందని క్రైగ్ హెడ్ కౌంటీ అధికారి మార్విన్ డే తెలిపారు. కానీ…భవనం చాలా మటుకు ధ్వంసమైందన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..