ఇండోనేషియా లో పెను భూకంపం, ఇండియాకి సునామి హెచ్చరిక

- December 14, 2021 , by Maagulf
ఇండోనేషియా లో పెను భూకంపం, ఇండియాకి సునామి  హెచ్చరిక

ఆగ్నేయ ఆసియా దేశం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సముద్రంలో తలెత్తిన ఈ భూకంపం వల్ల సునామీ తలెత్తొచ్చని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.  దాని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ ఐన వివరాలివి..

ద్వీపాల సముదాయమైన ఇండోనేషియాలో ప్రకృతి అంతాలకు నెలవైన ఫ్లోరెస్ దీవులకు సమీపంగా ఇవాళ భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 11.20 నిమిషాలకు భూకంపం వచ్చిందని అధికారులు చెప్పారు. ఫ్లోరెస్ ద్వీపంలోని అతిపెద్ద పట్టణం మౌమెరే తీరానికి ఉత్తరంగా 100 కిలోమీటర్ల దూరం భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సముద్రంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది తీవ్రమైన భూకంపం కావడంతో సునామీ అలలు తలెత్తొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇండోనేషియా లో పెను భూకంపం, ఇండియాకి సునామి  హెచ్చరిక 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com