200,000 బహ్రెయినీ దినార్లను దొంగిలించిన మహిళ భవిష్యత్ తేలనున్నది నేడే

- December 14, 2021 , by Maagulf
200,000 బహ్రెయినీ దినార్లను దొంగిలించిన మహిళ భవిష్యత్ తేలనున్నది నేడే

బహ్రెయిన్:  ఆసియా జాతీయురాలైన ఓ మహిళ, తాను పని చేస్తున్న సంస్థ నుంచి 200,000 బహ్రెయినీ దినార్లను దొంగిలించగా, ఈ కేసులో ఆమె భవితవ్యం నేడు తేలనుంది. 2014 నుంచి 2020 మధ్యలో ఈ దొంగతనం జరిగింది. వినియోగదారుల నుంచి సొమ్ముల్ని వసూలు చేసే క్రమంలో నిందితురాలు మోసానికి పాల్పడింది. వీడియో ప్రొడక్షన్ వ్యవహారాల్ని సదరు సంస్థ నిర్వహిస్తూ వస్తోంది. పలు భవనాలు కూడా ఆ సంస్థకు వున్నాయి. అద్దెలు, ఇతరత్రా మార్గాల్లో సంస్థకు వచ్చే సొమ్ముల్ని వసూలు చేయడం ఆమె బాధ్యత. ఈ క్రమంలోనే ఆమె ఈ దొంగతనానికి పాల్పడింది. తన కుటుంబ సభ్యులకు, ఇతర స్నేహితులకు ఆమె దోచేసిన సొమ్ముని ఇచ్చినట్లుగా గుర్తించారు. ఆమెకు ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఇప్పటికే న్యాయస్థానం తీర్పునివ్వగా, దాన్ని ఆమె అప్పీల్ మార్గంలో సవాల్ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com