ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు.. సినిమా టికెట్ల ధరల తగ్గింపు పై హైకోర్టు కీలక ఆదేశాలు..

- December 14, 2021 , by Maagulf
ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు.. సినిమా టికెట్ల ధరల తగ్గింపు పై హైకోర్టు కీలక ఆదేశాలు..

ఏపీలో సినిమా టికెట్లను తగ్గిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పించింది. సినిమా టికెట్ల ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ థియేటర్ల యాజమాన్యాల తరపు న్యాయవాదుల వాదనలు వినిపించారు. సినిమా విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని తెలిపారు. టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. పిటిషనర్ తరపు వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.

టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.35ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ థియేటర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని.. కొత్త సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకునే అవకాశం థియేటర్ యజమానులకు ఉంటుందని పిటిషన్లు పేర్కోన్నారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. థియేటర్ల యాజామాన్యాల తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణ రావు, దుర్గప్రసాద్ వాదనలు వినిపించారు. టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం35ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com