శర వేగంగా ఓమిక్రాన్ వ్యాప్తి: WHO
- December 15, 2021
జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 77 దేశాల్లో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిసి్ మాట్లాడారు. ఇంకా చాలా దేశాల్లో ఓమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే పనిలో ఉన్నారని అన్నారు. అయితే ఈ కొత్త వేరియంట్‌ను అదుపు చేసేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు.
వైరస్‌ను అంచనా వేయడంలో విఫలం అయ్యమని చెప్పారు. ఓమిక్రాన్ కేసులు పెరుగుదలతో మళ్లీ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. కొత్త వేరియంట్‌ను ఓమిక్రాన్‌ను తొలిసారిగా నవంబర్‌లో దక్షిణాఫ్రికా దేశంలో గుర్తించారని,ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచ వ్యాప్తంగా అసమానతలు ఉన్నాయని చెప్పారు. కొన్ని దేశాలకు ఇంకా వ్యాక్సిన్లు అందలేదని, ఈ సమయంలోనే కొన్ని దేశాలు బూస్టర్ డోసులు ఇస్తున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







