ప.గో.జిల్లాలో ఘోర ప్రమాదం.. వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. 9 మంది దుర్మరణం
- December 15, 2021
ఏపీ: బస్సులో 47 మందికి పైగా ప్రయాణికులు ఉండడం.. ఓవర్ లోడ్‌తో వెళుతుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
పశ్చిమగోదావరి జిల్లా లోని జంగారెడ్డిగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వెళుతుండగా తెలుగు వెలుగు బస్సు.. డివైడర్ ను ఢీ కొట్టి జిల్లేరు వాగులో బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 47 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారిని దగ్గర్లోని జాలర్లు, స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా అప్పటికే ఊపిరి ఆడక ఏడుగురు మరణించారు. గాయపడిన మిగతా వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. బస్సులో 47 మందికి పైగా ప్రయాణికులు ఉండడం.. ఓవర్ లోడ్‌తో వెళుతుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







