కువైట్ లో టీచర్లకు వ్యాక్సిన్ బూస్టర్ డోస్
- December 17, 2021
కువైట్: కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ భద్రతను పరిగణనలోకి తీసుకొని ముందు జాగ్రత్తగా కువైట్ వ్యాప్తంగా ఉన్న టీచర్లకు బూస్టర్ డోస్ అందివ్వాలని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు బూస్టర్ డోస్ తీసుకునేలా చొరవ తీసుకోవాలని స్కూల్ మేనేజ్ మెంట్లకు పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ అన్ని చోట్ల అందుబాటులో ఉందని, స్థానిక హెల్త్ డిపార్టుమెంట్ అధికారుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది. అలాగే స్కూళ్లలో నిర్దేశిత కొవిడ్ నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ... స్కూల్ మేనేజ్ మెంట్లను కోరింది.
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా హిట్మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







