90,000 మందికి వ్యాక్సినేషన్
- December 17, 2021
కువైట్: గత వారం రోజుల్లో 90,000 మంది పౌరులు అలాగే వలసదారులకు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. వీరిలో ఎక్కువమంది బూస్టర్ డోసులు తీసుకున్నవారేనని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. మిష్రీఫ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో గత కొద్ది రోజులుగా వ్యాక్సిన్ల కోసం రద్దీ ఎక్కువవుతోంది. మూడో డోస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ వారికి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతోంది. ఈ కేంద్రంలో అపాయింట్మెంట్ లేకుండానే వ్యాక్సినేషన్ చేస్తున్నారు. రెండో డోస్ తీసుకున్న తర్వాత ఆరు నెలలు పూర్తయితే, అలాంటివారికి మూడో డోసుని బూస్టర్ డోసుగా ఇస్తున్నారు. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వ్యాక్సినేషన్ కేంద్రం పనిచేస్తోంది.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు







