దుబాయ్ డెస్టినేషన్స్: 56 అందమైన చెరువుల్ని సందర్శించండిలా..
- December 17, 2021
దుబాయ్: దుబాయ్ సిటీ సెంటర్ నుంచి కాస్త దూరంగా, ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలనుకుంటే.. అల్ మర్మూమ్ ఎడారిలో అతి సుందరమైన ప్రాంతాల్ని సందర్శించొచ్చు. ప్రముఖమైన అల్ కుద్రా మరియు లవ్ లేక్స్‌తోపాటుగా మొత్తం 56 లేక్స్ (చెరువుల్ని) సందర్శించేందుకు వీలు కలుగుతుంది. ఎడారిలో క్యాంపింగ్ అలాగే, అరుదైన జంతు జాతుల్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలుగుతుంది. 950 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన ఎడారిలో చాలా సుందరమైన ప్రాంతాలున్నాయి. షేక్ జాయెద్ రోడ్డు నుంచి ఉమ్ సికిమ్ వద్ద రోడ్డు మారి దుబాయ్ స్టూడియో సిటీ డౌన్ నుంచి అల్ కుద్రా రోడ్డు వైపుగా వెళ్ళాలి. అక్కడే అల్ మర్మూమ్ తొలి ప్రధాన ఆకర్షణ ఎదురవుతుంది. 84 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ మరో ప్రధాన ఆకర్షణ. ఎక్స్‌పో లేక్, 2,000 ఏళ్ళ నాటి సరుక్ అల్ హాదిద్ ఆర్కియలాజికల్ ప్రాంతం.. ఇలా అబ్బురపరిచే ఎన్నో ప్రదేశాలు దర్శనమిస్తాయి. అల్ మర్మూమ్ డిజర్ట్ కన్జర్వేషన్ రిజర్వ్, విభిన్న రకాలైన జంతువుల సంరక్షణ కేంద్రంగానూ వుంది.
తాజా వార్తలు
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!







