అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ విస్తరణ
- March 24, 2016
దుబాయ్ సివిల్ యావియేషన్ అథారిటీ ప్రెసిడెంట్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ అండ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్, దుబాయ్ యావియేషన్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, అల్ జబర్ ఎల్ఇజిటి ఇంజనీరింగ్ మరియు కాంట్రాక్టింగ్ ఎల్ఎల్సి (ఎఎల్ఇసి)తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. అల్‌మక్తౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పాసింజర్ టర్మినల్ బిల్డింగ్ విస్తరణ ఈ ఒప్పందం ఉద్దేశ్యం. ప్రస్తుతం ఉన్న 66,107 చదరపు మీటర్ల ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ విస్తీర్ణాన్ని 145,926 చదరపు మీటర్లకు విస్తరిస్తారు. ఇది జూన్ 2017 నాటికి పూర్తవుతుంది. 2025 నాటికి ఎయిర్‌పోర్ట్‌లో 26.5 మిలియన్ ప్రయాణీకులకు సౌకర్యాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. షేక్ అహ్మద్ మాట్లాడుతూ, అల్ మక్తౌమ్ ఎయిర్ పోర్ట్‌ని 'ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఫ్యూచర్'గా మార్చుతామని అన్నారు. ఏడాదికి 220 మిలియన్ల ప్రయాణీకుల్ని అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆదరించగల సత్తా కలిగి ఉందని ఆయన వివరించారు. డిపాచ్యూర్ బిల్డింగ్‌లో పబ్లిక్ హాల్, కమర్షియల్ ఏరియాస్ మరియు ఆఫీసులను విస్తరించడం, 64 చెక్ ఇన్ కౌంటర్స్‌ని ఏర్పాటు చేయడం, అదనంగా 10 కౌంటర్లను ఏర్పాటు చేయడం వంటివి విస్తరణలో బాగం కానున్నాయి. 12 కొత్త బోర్డింగ్ లాంజెస్ను విస్తరణలో ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







