రైల్వే టైమ్ ఫ్రేమ్‌ని ఫిక్స్ చేయనున్న జిసిసి మినిస్టర్స్
- March 24, 2016
ఒమన్ సహా గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్‌కి చెందిన ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్స్ మల్టీ బిలియన్ డాలర్ విలువ చేసే రైల్వే ప్రాజెక్ట్ విషయమై చర్చించనున్నారు. జిసిసి దేశాలు సంయుక్తంగా రూపొందిస్తున్న భారీ రైల్వే ప్రాజెక్ట్‌కి టైమ్ ఫ్రేమ్ సెట్ చేయడానికి ఈ సమావేశం జరుగుతుందని మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ మరియు కమ్యూనికేషన్స్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఫుటైసి చెప్పారు యూఏఈకి చెందిన నేషనల్ రైల్వే కంపెనీ ఎతిహాద్ రైల్వే, సెకెండ్ స్టేజ్ ప్రాజెక్ట్‌ని రద్దు చేసిన దరిమిలా, దీనిపైనా చర్చలు జరగనున్నాయి ఈ సమావేశంలో. అయితే ఒమన్, అన్ని జిసిసి దేశాలతో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉంది. 2,135 వేల కిలోమీటర్ల మేర రూపొందనున్న ఈ రైల్వే ప్రాజెక్ట్, తొమ్మిది సెగ్మెంట్లుగా విభజించబడింది. ఫస్ట్ సిగ్మెంట్‌లోని సోహార్ బురైమి సెగ్మెంట్‌లోగల 207 కిలోమీటర్ల ప్రాజెక్ట్ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉంది. ఒమన్ తన ప్రాజెక్ట్‌ని పూర్తి చేసినా, ఇతర దేశాలు తమ పనిని పూర్తి చేయకపోవడంతో కనెక్టివిటీ కుదరదని మంత్రి చెప్పారు. జిసిసి దేశాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రైల్వే ప్రాజెక్ట్‌తో అన్ని దేశాల ఆర్థిక ముఖ చిత్రం మారిపోతుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







