అల్‌ మక్తౌమ్‌ ఇంటర్నేషనల్‌ విస్తరణ

- March 24, 2016 , by Maagulf
అల్‌ మక్తౌమ్‌ ఇంటర్నేషనల్‌ విస్తరణ



దుబాయ్‌ సివిల్‌ యావియేషన్‌ అథారిటీ ప్రెసిడెంట్‌, ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌ అండ్‌ గ్రూప్‌ చైర్మన్‌ మరియు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, దుబాయ్‌ యావియేషన్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ షేక్‌ అహ్మద్‌ బిన్‌ సయీద్‌ అల్‌ మక్తౌమ్‌, అల్‌ జబర్‌ ఎల్‌ఇజిటి ఇంజనీరింగ్‌ మరియు కాంట్రాక్టింగ్‌ ఎల్‌ఎల్‌సి (ఎఎల్‌ఇసి)తో అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. అల్‌మక్తౌమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ పాసింజర్‌ టర్మినల్‌ బిల్డింగ్‌ విస్తరణ ఈ ఒప్పందం ఉద్దేశ్యం. ప్రస్తుతం ఉన్న 66,107 చదరపు మీటర్ల ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ విస్తీర్ణాన్ని 145,926 చదరపు మీటర్లకు విస్తరిస్తారు. ఇది జూన్‌ 2017 నాటికి పూర్తవుతుంది. 2025 నాటికి ఎయిర్‌పోర్ట్‌లో 26.5 మిలియన్‌ ప్రయాణీకులకు సౌకర్యాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. షేక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ, అల్‌ మక్తౌమ్‌ ఎయిర్‌ పోర్ట్‌ని 'ఎయిర్‌పోర్ట్‌ ఆఫ్‌ ది ఫ్యూచర్‌'గా మార్చుతామని అన్నారు. ఏడాదికి 220 మిలియన్ల ప్రయాణీకుల్ని అల్‌ మక్తౌమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆదరించగల సత్తా కలిగి ఉందని ఆయన వివరించారు. డిపాచ్యూర్‌ బిల్డింగ్‌లో పబ్లిక్‌ హాల్‌, కమర్షియల్‌ ఏరియాస్‌ మరియు ఆఫీసులను విస్తరించడం, 64 చెక్‌ ఇన్‌ కౌంటర్స్‌ని ఏర్పాటు చేయడం, అదనంగా 10 కౌంటర్లను ఏర్పాటు చేయడం వంటివి విస్తరణలో బాగం కానున్నాయి. 12 కొత్త బోర్డింగ్‌ లాంజెస్‌ను విస్తరణలో ఏర్పాటు చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com